![]() |
![]() |
బుల్లితెర మీద అష్షు రెడ్డి ఫుల్ ఫేమస్. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది. అలాంటి అష్షు వాళ్ళ అమ్మతో కలిసి ప్రాంక్ వీడియో చేసింది. అది కూడా తన పెళ్లి, లివిన్ రిలేషన్ మీద. "అమ్మా నాకు 30 ఏళ్ళు వచ్చేసాయి లివిన్ రిలేషన్ లో ఉండి అంతా సెట్ అయ్యాక పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా." అంది అష్షు. "సెట్ అవడం అంటే ఏంటి. సెట్ కాకపోతే ఎం చేస్తావ్.. ఒకవేళ పిల్లలు పుట్టేస్తే ఎం చేస్తావ్" అని అడిగింది అష్షు వాళ్ళ అమ్మ. "సెట్ అవకపోతే వదిలేస్తా. వేరే అతన్ని చూస్తా. ఒక వేళా పిల్లలు పుట్టేస్తే వాళ్ళు ఐదారు తరగతులకు వచ్చేవరకు వెయిట్ చేసి అప్పుడు వాళ్ళ కలిసి వెళ్లి మా ఆయన్ని చేసుకుంటా" అని చెప్పింది.
"నా పిల్లల్ని నువ్వే పెంచాలి. మా ఆయన్ని నువ్వేం అనడానికి వీల్లేదు. ఐనా నువ్వు నాన్నతో లివిన్ లో లేకుండా ఎలా పెళ్లి చేసేసుకున్నావ్" అని అష్షు అడిగింది. " నీ పిల్లల్ని నేను పెంచాలా. ఎవడు నువ్వు సెట్ చేసుకునేవాడు చూపించు" అంటూ ఫైర్ అయ్యింది. " నేను పెళ్లి చేసుకున్నాను అంటే అది నమ్మకం. ఏంటి ఈ చెత్త లివిన్ రిలేషన్ లు. అసలు ఎవరు ఇలా చెప్తున్నాడు నీకు" అంది. "ఎదవా అని మా ఆయన్ని అనకు. ఆయన చాల మంచోడు" అని అష్షు అనేసరికి "ఎంత మంచోడో ఇప్పుడే తెలిసిపోతోంది అంది వాళ్ళ అమ్మ. "ఒకళ్ళు ఉద్యోగానికి వెళ్ళండి ఇంకొకళ్ళు పిల్లల్ని చూసుకోండి" అని సలహా ఇచ్చేసరికి "ఎలా కుదురుతుంది ఇద్దరూ ఉద్యోగాలు చేయకపోతే ఇల్లు గడవదు. నువ్వే వచ్చే మాకు వంట చేయాలి పిల్లల్ని చూడాలి అన్నీ నువ్వే చేయాలి" అంది అష్షు.
దానికి వాళ్ళ అమ్మ ఫుల్ ఫైర్ అయ్యింది. "ఇప్పుడు మనిషి మీద మనిషికి నమ్మకాలు లేవు అమ్మ. ఇప్పుడు అందరూ అలాగే నమ్మించి మోసం చేస్తున్నారు. నువ్వే వెనకబడిపోతున్నావు.ఫారెనర్ లా ఆలోచింహాలి " అంది అష్షు. "ఎటు వెళుతోంది అశ్విని మన సమాజం" అంది వాళ్ళ అమ్మ. ఇవన్నీ విన్నాక వాళ్ళ అమ్మ లేచి అష్షుని కొట్టేసింది. ఇక అష్షు అది ప్రాంక్ అని చెప్పేసరికి కన్నీళ్లు పెట్టుకుంది. ఇలాంటి విషయాల్లో ప్రాంక్ చేస్తారా అని అడిగింది. ఫైనల్ గా అష్షు ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద ప్రాంక్స్ చేయను మా అమ్మ కాళ్ళ మీద క్షమాపణ అడిగేసాను అని చెప్పింది.
![]() |
![]() |